Hyderabad | హైదరాబాద్ (Hyderabad) మియాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. మియాపూర్‌లోని మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. వారంతా ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు.
మృతులను నర్సింహా (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24), అప్పు (2)గా గుర్తించారు. వీరు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలంలోని రంజోలికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.