వెంగళరావునగర్, మార్చి 24: అమీర్టలోని (Ameerpet) క్రిసెంట్ కేఫ్ అండ్ బేకరీస్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఐదుగురు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు బేకరీలో గ్యాస్ సిలెండర్ లీకవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బేకరీ పక్కనే ఉన్న హరి దోశ హోటల్ గోడ కూలిపోయింది. ఇటుక ముక్కలు ఎగిరిపడటంతో వంటగదిలో పనిచేస్తున్న సోను అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా బబ్లూ కుమార్, నగేష్, కిరణ్ షిండే గాయపడ్డారు. మరో కార్మికుడు భీమ్‌కు స్వల్ప గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం అతన్ని దవాఖానా నుంచి డిశ్చార్జ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదుచేసిన ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.