కార్వాన్, ఫిబ్రవరి 9: సౌత్ ఏషియా సెపక్ తక్రా ఛాంపియన్షిప్లో భారత్ ఐదు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ విషయమై సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పెరిక సురేష్ మాట్లాడుతూ.. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన సౌత్ ఏషియా చాంపియన్షిప్ పోటీలో భారత్ తరఫున మహిళల, పురుషుల జట్లు ఐదు బంగారు పతకాలు సాధించాయని అన్నారు. సెపక్ తక్రా మేనేజ్మెంట్ కమిటీ నాయకత్వంలో ఈ లీగ్ వాలీబాల్ వేగంగా ప్రాచుర్యం పొందుతున్నదని అన్నారు.
ఇటీవలె టోక్యోలో జరిగిన 2026 ఏషియన్ గేమ్స్ టెస్ట్ ఈవెంట్లోనూ ఈ అనూహ్య విజయం పై సౌత్ ఏషియా సెపక్ తక్రా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, జాయింట్ సెక్రెటరీ పెరిక సురేష్, జనరల్ సెక్రెటరీ నరేష్ కుమార్తో పాటు ఆటగాళ్లు, కోచ్లు, మేనేజ్మెంట్ ఫెడరేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయం యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.