సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వచ్చేనెల 8,9తేదీల్లో చేపప్రసాదం పంపిణీకి సంబంధించి ఏర్పాట్లపై సోమవారం సెంట్రల్‌జోన్ డీసీపీ శిల్పవల్లి అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి హైదరాబాద్ నగరానికి చెందిన 21 ప్రభుత్వశాఖలతో పాటు నిర్వహణ కమిటీబాధ్యులు, ఎన్జీఓలు, ఎగ్జిబిషన్సొసైటీ ప్రతినిధులు హాజరయ్యారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ ఈ సంవత్సరం పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా జరిపించడానికి అవసరమైన సూచనలను వివిధ శాఖల అధికారులు చేశారు. బందోబస్తుపై చర్చించారు.