Chepa Prasadam | అబిడ్స్, జూన్ 5 : మృగశిర కార్తెని పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ఈనెల 8న అందించే చేప మందు ప్రసాదం పంపిణీకి ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో క్యూలైన్ల కోసం బారికేడ్లు, విద్యుద్దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులను చేపట్టారు. బ్యారికేడ్ నిర్మాణ పనులను అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ పాటు ఎస్ఐలు సిబ్బంది పర్యవేక్షించారు.