Durgam Cheruvu | హైదరాబాద్ : మాదాపూర్ దుర్గం చెరువు దుర్గంధంగా మారింది. చెరువులో వందలాది చేపలు మృత్యువాత పడ్డాయి. 3 రోజులుగా చేపలు చనిపోయి నీటిపై తేలి దుర్వాసన వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చనిపోయిన చేపలను చెరువులో నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడ్డారు.
ఇదే వాసన ఇలానే కొనసాగితే స్థానిక ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిన్నారులు వాంతులకు గురవుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చనిపోయిన చేపలను తొలగించి, నీటిని శుద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మాదాపూర్ దుర్గం చెరువులో వందలాది చేపల మృత్యువాత
3 రోజులుగా చేపలు చనిపోయి నీటిపై తేలి దుర్వాసన వస్తున్నాయని స్థానికుల ఆగ్రహం pic.twitter.com/1Z4u6sxLce
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025