కలుషిత నీటితో చేపలు మృతి
కలుషిత నీటి కారణంగా మత్య్సకారులకు తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టి మత్స్యకారులను ఆదుకోవాలని కొల్తూర్ మత్స్యకారుల సంఘం సభ్యులు కోరారు. మూడుచింతలపల్లిలోని కొల్తూర్ పెద్ద చెరువులో వందల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. విషయాన్ని గమనించిన మత్స్యకారులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు.
- రూ.15 లక్షల వరకు ఆస్తినష్టం
- మత్స్యకారులను ఆదుకోవాలని వినతి
శామీర్పేపేట, ఆగస్టు 20 : కలుషిత నీటి కారణంగా మత్య్సకారులకు తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టి మత్స్యకారులను ఆదుకోవాలని కొల్తూర్ మత్స్యకారుల సంఘం సభ్యులు కోరారు. మూడుచింతలపల్లిలోని కొల్తూర్ పెద్ద చెరువులో వందల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. విషయాన్ని గమనించిన మత్స్యకారులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. తుర్కపల్లి-కొల్తూర్ పరిధి పారిశ్రామికవాడలోని కొన్ని పరిశ్రమల నుండి వెలువడే కలుషిత కెమికల్ నీళ్లే కారణమని ఆరోపించారు. కెమికల్ నీటిని కాలువలోకి వదలడం వల్లే నేడు చేపలు మృత్యువాత పడ్డాయని తెలిపారు.
ఫార్మా కంపెనీల నుండి వచ్చే కెమికల్ నీటితో గత 10 సంవత్సరాలుగా సాగునీటికి, తాగునీటికి కొల్తూర్ గ్రామస్తులు, మత్స్యకారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యా దు చేయడంతో నోటీసులు ఇచ్చారని అయినా ఈ ఫార్మా కంపెనీల ఆగడాలు ఆగడం లేదన్నారు. మున్సిపల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పారిశ్రామిక శాఖల అధికారులు స్పందించి మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కొండ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు దుర్గం నర్సింలు, కొండ బిక్షపతి, కొండ పాండు, లక్ష్మయ్య, ఏ.బిక్షపతి, వెంకటేశ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

