అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు అమోఘం
రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ కూకట్పల్లి డివిజన్ ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జీడిమెట్ల అగ్ని మాపక కేంద్రం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు
కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు
విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
రక్తదాన శిబిరం ఏర్పాటు
పాల్గొన్న ఎమ్మెల్యే, అగ్నిమాపక అధికారులు
జీడిమెట్ల, ఏప్రిల్ 16: రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ కూకట్పల్లి డివిజన్ ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జీడిమెట్ల అగ్ని మాపక కేంద్రం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ హాజరై పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, మెమోంటోలను అందజేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసిఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అగ్ని మాపక శాఖ డిజాస్టర్ రెస్పా న్స్ టీం పటిష్టంగా ఉందన్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న అగ్ని మాపక సిబ్బందిని అభినందించారు.
అంతకు ముందు అగ్ని మాపక పరికరాల పని తీరుపై అధికారులు ఎమ్మెల్యేకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్తదాన శిబిరంలో 60 మంది అగ్ని మాపక సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో రిజనల్ అగ్ని మాపక అధికారి వి.పాపయ్య, కూకట్పల్లి డివిజన్ డీఎఫ్ఓ బి.సుధాకర్‌రావు, ఎడీఎఫ్ఓ సైదులు, సతీష్‌కుమార్, ఎస్హెచ్ఓలు వి.సుభాష్‌రెడ్డి, సతీష్‌కుమార్, కృష్ణారెడ్డి, పూర్ణకుమార్, శివ ప్రసాద్, అజ్మత్, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, రంగరాయ ప్రసాద్, ఎత్తరి మారయ్య, వేణుయాదవ్ , సిద్దిక్, మధుమోహన్‌తో పాటు అగ్ని మాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- కుత్బుల్లాపూర్: నార్త్‌జోన్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సూరారం భీమా గార్డెన్ నుంచి కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానం వరకు నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరయ్యారు.కార్యక్రమంలో పాస్టర్ శేఖర్, కేవీ.పాల్, విజయ్‌భాస్కర్, చెన్నపురెడ్డి, రాజశేఖర్, గణేశ్ థామస్, ఆనంద్ బాబు, సత్తిరెడ్డి, భాగ్యరాజు, సూర్యప్రకాశ్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
- కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మానగర్ ఫేస్-1లో వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- దుండిగల్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్‌లోని శ్రీపట్టాభి రామాంజనేయస్వామి ఆలయం ప్రాంగణంలో శనివారం ఆలయ కమిటీ చైర్మన్ చల్లా సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీగౌరీ శంకరస్వామి ఆల య ధ్వజస్తంభం,చండీశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్, మేయర్ నీలాగోపాల్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలోనిజాంపేట కార్పొరేషన్ కార్పొరేటర్లు ఇంద్రజిత్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు గోపాల్‌రెడ్డి,నిజాంపేట్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయప్రసాద్, ఉపాధ్యక్షుడు రాములునాయక్, సంయుక్త కార్యదర్శి స్వామి, సీనియర్ నాయకులు జగన్యాదవ్, మహేందర్‌రెడ్డి, కుమార్, భూపతి, ఆనంద్‌రెడ్డి, ముత్యాలు, ఆల య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

