బండ్లగూడ, డిసెంబర్ 15: ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్ హైదర్‌గూడలోని నెక్స్ జెన్ కార్ సర్వీసింగ్ సెంటర్లో నాలుగు కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక కారు పూర్తిగా దహనం కాగా, మరికొన్ని కార్లకు మంటలు ఉండగా స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. ఆదివారం కావడంతో సర్వీసింగ్ సెంటర్ మూసి ఉన్నది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.