హైదరాబాద్: సికింద్రాబాద్లోని లోతుకుంటలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. లోతుకుంటలోని (Lothukunta) ఓ సైకిల్ దుకాణంలో (Cycle Shop) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్ మొత్తం విస్తరించడంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డాయి. క్రమంగా మంటలు పక్కన ఉన్న దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీంతో ఆరు షాపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.