అమీర్‌పేట్‌లో అగ్ని ప్రమాదం
అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమా దం సంభవించింది. అమీర్‌పేట్ మైత్రీవనం సమీపంలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని మూడంతస్తుల భవనంలోని రెండో ఫ్లోర్లో ఉన్న హెల్మెట్ బజార్ దుకాణంలో గురువారం మధ్యా హ్నం 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వాణిజ్య సముదాయంలోని మూ డంతస్తులకు వ్యాపించాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో దుకాణాల నిర్వాహకులు, సిబ్బంది, కొనుగోలుదారులు భవనం మెట్ల మార్గం ద్వారా పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.
- ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీగా ఎగిసిపడిన అగ్ని కీలలు
- మెట్రో పిల్లర్ల వరకు ఎగిసిపడిన మంటలు
- పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్న షాపుల్లోని సిబ్బంది, కస్టమర్లు
- ఫైరింజన్లు, వాటర్ ట్యాంకర్లతో మంటల్ని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
- షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందంటున్న అధికారులు
- తప్పిన ప్రాణాపాయం, భారీగా ఆస్తినష్టం
వెంగళరావునగర్, జూన్ 4: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమా దం సంభవించింది. అమీర్‌పేట్ మైత్రీవనం సమీపంలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని మూడంతస్తుల భవనంలోని రెండో ఫ్లోర్లో ఉన్న హెల్మెట్ బజార్ దుకాణంలో గురువారం మధ్యా హ్నం 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వాణిజ్య సముదాయంలోని మూ డంతస్తులకు వ్యాపించాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో దుకాణాల నిర్వాహకులు, సిబ్బంది, కొనుగోలుదారులు భవనం మెట్ల మార్గం ద్వారా పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.
అయితే ఈ క్రమంలో కొంత తోపులాట జరగటంతో కొందరికి స్పల్ప గాయాలయ్యాయి. కాంప్లెక్స్ లోని దాదాపు 20 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. మూడు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ట్రావెల్ ఏజెన్సీ దుకాణాలు, ఓ మొబైల్ దుకాణం, మెదటి, రెండో అంతస్తులో హెల్మెట్లు విక్రయించే హెల్మెట్ బజార్, కేఎస్ఆర్ ఫ్యాషన్స్ పేరిట వస్త్ర దుకాణం, బొమ్మల దుకాణం ఉన్నాయి. అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.
మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది..
షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చే దట్టమైన పొగ కొద్ది దూరంలోనే ఉన్న అమీర్‌పేట్ మెట్రో కారిడార్ పైకి వ్యాపించాయి. దీంతో మొట్రో రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. ప్రమాద ఘటనలో ఎలాం టి ప్రాణానష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అమీర్‌పేట్ నుంచి ఎస్.ఆర్.నగర్ వైపునకు రాకపోకలు సాగించే రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
జిల్లా అగ్నిమాపక అధికారులు ఎ.శ్రీదాస్, వెంకన్న జిల్లా సహాయక అగ్నిమాపక అధికారులు సురేష్ రెడ్డి, దుర్గా ప్రసాద్, యుగంధర్ ప్రసాద్, అదనపు డీసీపీ శ్రీకాంత్, ఏసీపీ రాఘవేంద్రరావు, ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్‌తో పాటు మధురానగర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సంఘటన స్థలం వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. కాగా అగ్ని కీలలు భారీగా ఎగిసి పడటంతో ధాటికి మెట్రో పిలర్ల కింద ఉన్న తాగునీటి పైప్‌లైన్ కాలిపోవడంతోపాటు మెట్రో పిలర్ల కిందిభాగంలో పెచ్చులు ఊడిపోయాయి. ఎల్అండ్టీ అధికారులు పరిస్థితిని సమీక్షించారు.
మంటలను ఆర్పడంలో రోబో సహాయం
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పడానికి అధికారులు మర మనిషి(రోబో)ని వినియోగించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రోబో అగ్నికీలలు ఆర్పివేయడంలో విశేషంగా పనిచేసింది.
బాధితులను ఆదుకోవాలి: మాజీమంత్రి తలసాని
అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. అమీర్‌పేట్‌లో ప్రమాదం ఘటనాస్థలిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుకూడా లేదని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించిన అధికారులను తలసాని అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

