ORR | ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. మంటల్లో తగలబడ్డ కారు
ORR | రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి.
ORR | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆకస్మాత్తుగా ఆపేశాడు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బయటకు దిగేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనతో ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
రెండు రోజుల క్రితం కర్నూల్ జిల్లాలో వీ కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. నిన్న పెద్ద అంబర్పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై న్యూ గో అనే ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Car Fire
- Fire Tenders
- Narsingi
- ORR
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

