NIMS | హైదరాబాద్ : నగరం నడిబొడ్డున ఉన్న నిమ్స్ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించే అవకాశం ఉంది. అప్రమత్తమైన నిమ్స్ సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది.
ఇక మంటలు ఎగిసిపడడంతో తీవ్ర ఆందోళనకు గురైన రోగులు భయంతో పరుగులు పెట్టారు. రోగుల సహాయకులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా ఆస్పత్రి ప్రాంగణంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో రోగులకు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.