Hyderabad | హైదరాబాద్ : మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం కృష్ణాస్ కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. హోటల్‌కు భోజనం చేసేందుకు వెళ్లిన వారు క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కస్టమర్లను ఆకర్షించేందుకు అశ్లీల డ్యాన్సులు.. సనత్‌నగర్‌లో బార్ యజమానిపై కేసు
Hyderabad | 500 ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పరిశీలన.. అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం
Harish Rao | రేవంత్ ఏడాది పాలనలో కోతలు, ఎగవేతలు, కేసులే.. మండిపడ్డ హరీశ్‌రావు