Hyderabad | హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఎవర్గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ట్లు ఆరోపణల నేపథ్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పబ్‌లో ఏడాదిగా అమ్మాయిలతో డ్యాన్సులు చేయిస్తున్నట్లు గుర్తించారు.
ఎవర్గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్లో డ్యాన్స్ చేసే 11 మంది యువతులు, ఇద్దరు డీజే నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల తనిఖీల సమయంలో రెస్టారెంట్ నిర్వాహకులు పరారయ్యారు. కాగా, ఎవర్గ్రీన్ బార్ యజమాని కృష్ణంరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.