హైదరాబాద్ : మలక్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని సలీం నగర్లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఫరహత్ ఆస్పత్రి గేటు సమీపంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను వేరే భవనానికి తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఆస్పత్రి ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.