హైదరాబాద్ : మారేడుపల్లిలోని (Maredupalli)ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యాలయంలో(Incredible India office) అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గుర్తించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.