Fire Accident | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్టుకు సమీపంలోని ఓ బ్యాటరీల కంపెనీలో మంటలు చెలరేగినట్లు అధికారులు, పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసింది.
నిర్మాణంలో ఉన్న బ్యాటరీల కంపెనీ మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో.. కార్మికులు పరుగులు తీశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెల్డింగ్ పనుల కారణంగా మంటలు చెలరేగాయా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పోలీసులు, కంపెనీ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Pushpa | ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా..? మంత్రి సీతక్క విమర్శలు..!