కుత్బుల్లాపూర్, నవంబర్13 : కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు చెలరేగాయి. సర్కిల్ కార్యాలయం మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు, ఫైర్‌స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు.
కాగా.. అప్పటికే పలు రికార్డులు, ఫైళ్లు తగులబడిపోయాయి. దీనికి తోడు అదే విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది పొగలో చిక్కుకోగా.. వారిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.