పహాడీషరీఫ్, ఏప్రిల్ 22 : బాలాపూర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్స్పెక్టర్ టి.భూపతిరెడ్డి, ఎస్సై యూసుఫ్ జానీ కథనం ప్రకారం.. కొత్తపేట గ్రామంలో మూడేండ్ల కిందట హజీ బహెలాన్ ప్లాస్టిక్‌తో చిప్స్ తయారీ చేసే పరిశ్రమ ఏర్పాటు చేశాడు. ఈ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవు.
సోమవారం ఉదయం కార్మికులు యంత్రాలు స్టార్ట్ చేయగా.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, ఒక్కసారిగా మంటలొచ్చాయి. అక్కడ పనిచేసే కార్మికులు బాలాపూర్ పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేశాయి. గోదాం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు