మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అల్విన్ కాలనీలోని అన్నపూర్ణ ఎలక్ట్రానిక్స్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్స్ షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.