హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాణిగంజ్‌లో (Raniganj) ఉన్న ఓ ఎలక్ట్రిక్ గోదాంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాం మొత్తం వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.