హైదరాబాద్: హైదరాబాద్ వనస్థలిపురంలోని గణేశ్ టెంపుల్ (Ganesh Temple) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్ టెంపుల్ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్ మొత్తానికి విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.
#WATCH | Fire broke out at a shop in Telangana’s Rangareddy pic.twitter.com/5i4olnjfxw
— ANI (@ANI) October 16, 2023