బేగంపేట్, మే 4(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ ప్యాట్నీసెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ నాల్గవ అంతస్తులో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో ఆదివారం కావడంతో బ్యాంక్ సిబ్బంది లేకపోవడం వల్ల మంటలు చూసిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రమాదానికి సంబంధించి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాల్గవ అంతస్తులో లోన్డిపార్ట్మెంట్తో పాటు ఫర్నిచర్కూడా పెద్ద ఎత్తున ఉండడంతో ఆ ఫ్లోర్ మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎంతమేరకు నష్టం జరిగింది, ఫైల్స్‌కు సంబంధించిన వివరాల సేకరణలో బ్యాంక్ అధికారులు సిబ్బందితో మాట్లాడుతున్నారు.