Krishna Kitchen | కొండాపూర్, జనవరి 8: మాదాపూర్ దుర్గంచెరువు సమీపంలోని క్రిష్ణ కిచెన్ రెస్టారెంట్లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న మాదాపూర్ ఫైర్ స్టేషన్ అధికారులు, సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన ఏసీలో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని, సుమారు రూ.20లక్షల ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.