అబిడ్స్, ఆగస్టు 3 : మంగళహాట్ ప్రాతంలోని ఓల్డ్ ప్రకాశ్ థియేటర్లో ఉన్న ైప్లెవుడ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి థియేటర్లోని ైప్లెవుడ్ డోర్లు తయారు చేసే షెడ్‌కు మంటలందుకున్నాయి. డోర్లకు వినియోగించే రసాయనాలు కూడా ఉండటంతో కొద్ది సేపట్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ రణ్‌వీర్‌రెడ్డి, గోషామహల్ కార్పొరేటర్ లాల్‌సింగ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలు ఆర్పివేయగా.. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీం వారికి తోడ్పాటునందించారు.