బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు బయట వాక్వేలో శనివారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ వాక్వేలో చెత్తాచెదారంతో పాటు రాలిన ఆకులను సిబ్బంది కుప్పగా పోశారు. ఎవరో సిగరెట్ తాగి పారవేయడంతో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. కాగా కేబీఆర్ పార్క్లో మంటలు అంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్ట్లు పెట్టడంతో అధికారులు వచ్చి పరిశీలించారు. వాక్వేలో చెత్త కుప్ప మాత్రమే అంటుకుందని, అంతకుమించి ఎలాంటి నష్టం జరగలేదని పార్కు సిబ్బంది స్పష్టంచేశారు. పార్కులో చెట్లు అంటుకున్నాయంటూ సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.