Fire Accident | హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బుధవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీదత్త సాయి కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, కాంప్లెక్స్‌ను ఆనుకొని దుకాణాలు ఉన్నాయి. చుట్టుపక్కలకు మంటలు అంటుకొనే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారందరినీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా పొగ కమ్మేసింది. ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదం స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.