Fire Accident | హైదరాబాద్లోని హయత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.