Hyderabad | హైదరాబాద్ అమీర్‌పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రీవనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కోచింగ్ సెంటర్ సిబ్బంది.. విద్యార్థులను బయటకు పంపించేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైర్ యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.