Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీ ఛత్రినాకలోని ఓ రెండంతస్తుల భవనంలో మంగళవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. భవనం రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డ వెంటనే.. ఆ భవనంలో ఉన్న నివాసితులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ భవనంలో చెప్పుల గోదాం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్లో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే అదే పాతబస్తీలో మరో అగ్నిప్రమాదం సంభవించడం ఆందోళనకు గురి చేసింది.