Fire Accident | హైదరాబాద్ : నగర పరిధిలోని చందానగర్‌లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చందానగర్‌లోని సెంట్రో భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ప్రధాన రహదారిపై ఉన్న ఈ బిల్డింగ్‌లో మంటలు ఎగిసి పడడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటానస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా చందానగర్ – లింగంపల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.