సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : విదేశాల్లో భారతీయ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న వీమేక్ స్కాలర్స్ సంస్థ దేశంలోనే అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్పోను ఈనెల 12న నగరంలో నిర్వహించనుంది.ఈ కార్యక్రమం బేగంపేట్‌లోని మనోహర్ హోటల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగుతుందని నిర్వాహకులు వీమేక్ స్కాలర్స్ సంస్థ సీఈఓ దామిని మహాజన్, కో ఫౌండర్ అర్జున్ కృష్ణ గురువారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ ఈవెంట్‌ను వీ మేక్ స్కాలర్స్-ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ నిర్వహించనుందని, గత ఏడాదిలో రూ.4,200 కోట్ల విద్యా రుణాలు అందించిందని పేర్కొన్నారు. 26వేలకు పైగా అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లకు యాక్సెస్‌ను అందించే స్కాలర్షిప్ పోర్టల్‌ను నిర్మించారని పేర్కొన్నారు. ఈ ఈవెంట్లో యూఎస్ఏ, యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు హాజరుకావాలని తెలిపారు. అలాగే https://www.wemake scholars. com/study-abroad-funding-expo-safe లింక్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. www.WeMakeScholars.comను సంప్రదించొచ్చని చెప్పారు.