సిటీబ్యూరో: ఎట్టకేలకు ఓటీఎస్ నిబంధనల్లో మార్పులు తీసుకొస్తూ జలమండలి నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులు భవిష్యత్లో సక్రమంగా నీటి బిల్లు చెల్లిస్తామని, చెల్లించని పక్షంలో రద్దు చేసిన ఓటీఎస్ రాయితీ భారం తీసుకోవాలని నిబంధన పెట్టి బకాయిదారుడి నుంచి ఆఫిడవిట్ తీసుకుంటున్నది.
ఈ నిబంధనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం..ఓటీఎస్ అమల్లో లోపాలను వివరిస్తూ ‘నమస్తే’ కథనాలను ప్రచురించింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వానికి ఆఫిడవిట్ను సమర్పించే నిబంధనను సడలించి..దాని స్థానంలో హామీపత్రం సమర్పించే వెసులుబాటు కల్పించిందని జలమండలి పేర్కొన్నది.