ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 15: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంఅండ్సీటీ, బీసీటీసీఏ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.