ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 4: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్ డీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరేళ్ల ఫార్మ్‌డీ రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్, మూడేళ్ల ఫార్మ్‌డీ రెండో సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని ఆయన సూచించారు.