బంజారాహిల్స్: ఫిలింనగర్ బస్తీల్లో గంజాయి మత్తులో యువకులు మునిగిపోతున్నారు.. దీన్ దయాళ్‌నగర్ బస్తీలోని ఆలయ పరిసరాల్లో మందుబాబులు తిష్టవేస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.. అంటూ స్థానిక మహిళలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను చుట్టుముట్టి తమ గోడును వెల్లబోసుకున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఫిలింనగర్‌లోని దీన్ దయాళ్నగర్కు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుకు కాల్ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. పోలీసుల పనితీరుపై జనం నిలదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.