Hyderabad | హైదరాబాద్ : బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి బోయిన్పల్లి బస్టాప్‌కు బైక్‌పై బయల్దేరిన తండ్రీకూతుళ్లను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. వైష్ణవి అనే యువతి తన తండ్రితో కలిసి బుధవారం మధ్యాహ్నం బోయిన్పల్లి బస్టాప్‌కు బయల్దేరింది. వీరి బైక్ ప్రమాదవశాత్తు స్కిడ్ అయింది. వెనుకాలే వచ్చిన డీసీఎం.. తండ్రీకూతుళ్లపై నుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైష్ణవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైష్ణవి ఎంఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమెను కాలేజీకి పంపే క్రమంలో బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.