జిల్లాలోని బండరావిరాలలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి చెత్త, కాలుష్యమయంగా చేయొద్దని బండరావిరాల, పరిసర గ్రామాల రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద కదంతొక్కారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే సుమారు 16 గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని, డంపింగ్‌యార్డు నిర్మాణం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 20ని వెంటనే రద్దు చేయాలని బండరావిరాలతోపాటు పరిసర గ్రామాలు ప్రజలు, నాయకులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, వంగేటి లక్ష్మారెడ్డి,రాంరెడ్డి తదితర నేతలు, బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

రంగారెడ్డి, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని బండరావిరాలలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి చెత్త, కాలుష్యమయంగా చేయొద్దని బండరావిరాల, పరిసర గ్రామాల రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద కదంతొక్కారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే సుమారు 16 గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని, డంపింగ్‌యార్డు నిర్మాణం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 20ని వెంటనే రద్దు చేయాలని బండరావిరాలతోపాటు పరిసర గ్రామాలు ప్రజలు, నాయకులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.
దీనికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, వంగేటి లక్ష్మారెడ్డి, దండెం రాంరెడ్డి తదితర నాయకులు, బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి లోనికి వెళ్లకుండా అడ్డుకోగా.. కోపోద్రిక్తులైన నాయకులు, రైతులు కలెక్టరేట్ ప్రధాన గేట్‌ను బలవంతంగా తెరిచి పోలీసులను దాటుకుని లోపలికి పరుగులు తీశారు. అక్కడే సుమారు రెండు గంటల పాటు బీఆర్ఎస్ నేతలు, రైతులు బైటాయించి ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు కోసం విడుదల చేసిన జీవో 20ని రద్దు చేయాలని, డంపింగ్‌యార్డు నిర్మాణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రజావాణిలో వినతిపత్రం ఇస్తామని బీఆర్ఎస్ నేతలు, రైతులు పోలీసులను కోరగా, వారు ఐదుగురిని మాత్రమే లోనికి పంపించి మిగిలిన వారిని కట్టడి చేశారు. కలెక్టర్ లేకపోవడంతో ప్రజావాణిలో ఉన్న అదనపు కలెక్టర్లు వచ్చి తమ వినతి పత్రాన్ని తీసుకోవాలని ఆందోళనకారులు కోరినా.. ఆ అధికారులు అంగీకరించలేదు. దీంతో దాదాపు నాలుగు వందల మంది రైతులు పోలీసు వలయాన్ని ఛేదించుకొని సమావేశ మందిరంలోకి పరుగులు తీశారు. అప్పటికే అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతుండగానే ఆందోళనకారులు వారిని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము నాలుగు గంటల పాటు కలెక్టరేట్ గేట్ల వద్ద ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. అనంతరం డంపింగ్‌యార్డు ఏర్పాటుకు సంబంధించిన జీవోను వెంటనే రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో తుగ్లక్ పాలన..

రాష్ట్రంలోని రేవంత్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నది. దానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజుల్లో దగ్గర్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతున్నది. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవడంలేదు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఔటర్‌రింగ్‌రోడ్డు పక్కనే రూ. వందల కోట్ల విలువ చేసే భూమిని చెత్తకుప్పలు వేసేందుకు వినియోగించాలని నిర్ణయించడం తుగ్లక్ పాలనకు నిదర్శనం. బండరావిరాలలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల సుమారు 16 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు ఆ 16 గ్రామాలకు చెందిన బాధితులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలి. బండరావిరాలలో ని సర్వేనంబర్ 268లో ఉన్న 494 ఎకరాల భూమిలో ఐటీ, ఇతర పారిశ్రామిక అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి. – దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ
జిల్లాలోని భూములపై రేవంత్ కన్ను పడింది..

జిల్లాలోని విలువైన ఖాళీ భూములపై రేవంత్ కన్ను పడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ భూముల ను తన అనుయయులకు కట్టబెడుతున్నారు. దీంతో పేదలు తమ భూములను కోల్పోవాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కార్‌తో జిల్లాకు ముప్పు ఉన్నది. ప్రజలంతా మేల్కోవాలి. నగరంలోని జవహర్‌నగర్‌లో ఉన్న డంపింగ్‌యార్డును జిల్లా ప్రజల నెత్తిన రుద్దాలని సర్కార్ చూస్తున్నది. ఆ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికే బండరావిరాల సమీపంలో ఉన్న క్రషర్లతో ప్రజలు ఇబ్బందిపడుతుం టే.. అది చాలదన్నట్టు డంపింగ్ యార్డు ఏర్పాటుకు సర్కార్ చర్యలు తీసుకోవడం దారుణం. ఇక్కడ డం పింగ్యార్డు ఏర్పాటుచేస్తే బండరావిరాల, చిన్నరావిరాల, సుద్దపల్లి, గువ్వలేటితోపాటు మరో 13 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమా దం ఉన్నది. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపకుండా ఏకపక్షంగా వ్యవహరించి ప్రజలకు తీవ్ర అన్యా యం చేయాలని చేస్తున్నది.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
పొయ్యి నుంచి పేనంలో పడ్డట్టు ..

బండరావిరాలలో డంపింగ్‌యార్డు ఏర్పాటుచేస్తే ఈ ప్రాంత ప్రజలు పొయ్యి నుంచి పేనం లో పడ్డట్టు అవుతుంది. బండరావిరాల పరిసర గ్రామాల ప్రజల నిన్నటి వరకు క్రషర్ మిషన్లతో అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం కొత్తగా డంపింగ్‌యార్డు ఏర్పాటుచేసి కొత్త సమస్యను తీసుకురావొద్దు. ప్రశాంతంగా ఉన్న బండరావిరాలను చెత్త, కాలుష్యకారకంగా మార్చొద్దు.
-క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట..
బండరావిరాల డంపింగ్‌యార్డు వ్యతిరేక బాధితులు, పోలీసులకు మధ్య కలెక్టరేట్ వద్ద పలు మార్లు తోపులాట జరిగింది. కొంగరకలాన్ నుంచి కలెక్టరేట్ వద్దకు వచ్చిన బండరావిరాల డంపింగ్‌యార్డు బాధితులకు సంఘీభావంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, క్యామ మల్లేశ్, వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు కలెక్టరేట్ గేట్ వద్ద నిలబడి ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో బండరావిరాల సర్పంచ్ రవీందర్, బీఆర్ఎస్ నాయకులు దండెం రాంరెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి, బుగ్గరాములు, గణేశ్, వెంకట్‌రెడ్డి, జగదీశ్వర్, శివసాయి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.