వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్), జూన్ 4: రాష్ట్రంలో విత్తన కొరతతో ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పాలకులు మాత్రం విత్తనాలు అందుబాటులో ఉంచా అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక రాష్ట్ర రాజధానిలోనైనా విత్తనం దొరుకుతుందనే ఉద్దేశంతోసుదూర ప్రాంతాల నుంచి విత్తనం కోసం హైదరాబాద్ వస్తున్నారు రైతులు. అయితే నగరంలో విత్తనం అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు వ్యక్తులనుఆశ్రయిస్తున్నారు. విత్తన వ్యాపారులు, దళారులు వాటిని తమ సొంతం చేసుకొని అధిక ధరలకు విక్రయించేందుకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలున్నాయి.
దాస్ 75తో మంచి ఫలితాలు..
భారతీయ వరి పరిశోధన కేంద్రం ‘దాస్ 75’ అనే కొత్త రకాన్ని కనుగొందని ,మంచి ఫలితాలు ఇస్తుందని, విస్తృతంగా ప్రచారం జరగడంతో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అది కొరతగా ఉందని దాస్ 60 కొన్ని రోజులు మరికొన్ని రోజులు 50 రకాలను రైతులకు రెండు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అక్కడ ఏ అధికారి బాధ్యతగా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీంతో జాతీయ వరి పరిశోధన కేంద్రం వద్దకు రోజురోజుకు రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఉండటంతో ఇక్కడ నిరాశ మిగిలింది. పీజేటీఏయూ సేల్స్ కౌంటర్ వద్ద ఎంటియూ 1010 రకానికి చెందిన 25 కిలోల బ్యాగుకు రూ.1130, అదేవిధంగా బీపీటీ 5204 రకానికి చెందిన 20 కిలోలకు రూ.1,060, ఆర్ఎన్ఆర్ 1,5048 రకానికి 15 కిలోల బ్యాగ్‌కు రూ.795 ప్రకటించినప్పటికీ ఆయా రకాలు ఎక్కడా అందుబాటులో లేవు..
ప్రభుత్వం రైతు ముంగిట శాస్తవ్రేత్తలు అని చెప్పడంతో ఆ శాస్తవ్రేత్తలు సైతం విత్తనం రాష్ట్ర రాజధాని కేంద్రంలో ఉంటుందని చెప్పడంతో పెద్ద ఎత్తున రైతులు హైదరాబాద్ వస్తున్నారు. దీంతో జాతీయ వరి పరిశోధన కేంద్రం వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. అక్కడ ఉన్నవారు తెలుగు రాకపోవడం.. వ్యవసాయదారులకు హిందీ రాకపోవడం అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. వారికి కంటి తుడుపు చర్యగా రూ.163కు రెండు కిలోల బ్యాగు ఇచ్చి పంపిస్తున్నారు. సంబంధిత సేల్స్ అధికారి సెల్ నెంబర్లు ఏవి పనిచేయడం లేదని రైతులు వాపోతున్నారు.