రామంతాపూర్,ఆగస్టు 19 : విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కృష్ణ, సురేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు నష్ట పరిహారాన్ని తిరస్కరించారు. కాటేపల్లి శ్రీకాంత్‌రెడ్డి, హబ్సిగూడకు చెందిన రుద్రవికాస్,రాజేందర్‌రెడ్డి కుటుంబాలకు అంత్యక్రియల కోసం రూ. 50 వేలు, ప్రభుత్వం ప్రకటించిన చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలోడిప్యూటీ తహసీల్దార్ సురేశ్, ఆర్ఐ సాయి తదితరులు పాల్గొన్నారు.
చెట్టంత కొడుకులు పోయారు మమ్మల్ని ఎవరు సాదుతారు. వారి మీదనే ఆధార పడి ఉన్నాం.. నష్ట పరిహారం తమకు వద్దంటూ చెక్కులు ఇవ్వడానికి వచ్చిన అధికారులను పాత రామంతాపూర్ కు చెందిన కృష్ణయాదవ్ తల్లి మాధవి,తండ్రి రఘుయాదవ్, సురేశ్ యాదవ్ తల్లి లక్ష్మమ్మ,తండ్రి వెంకటయ్య అడ్డుకున్నారు. రూ. 10 లక్షలు ఇవ్వాలని కుటుంబంలో ఒకరికీ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంత్యక్రియల కోసం చెక్కులు వద్దన్నారు. కొడుకుల సంపాదనతోనే తాము బతుకుతున్నామన్నారు.