పీర్జాదిగూడ, మే 15 : కుటుంబ కలహాలతో ఓ తల్లి.. ముగ్గురు పిల్లలతో క లిసి చెరువులో దూకి ఆత్మహత్యకు య త్నించగా.. తల్లి, చిన్న కూతురు మృతి చెందగా, మరో ఇద్దరిని స్థానికులు కా పాడారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం… మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం, కన్మనూరుకు చెందిన లోకమని నాగరాజు, భార్య సుజాత( 32 ) 15 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
అక్కడినుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నారపల్లి మహాలక్ష్మిపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురు అక్షి త, రెండవ కూతురు ఉదయశ్రీ, చిన్న కూతురు వర్షిణిలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. నాగరాజు ఆటో డ్రైవర్గా, సుజాత స్థానికం గా చెరుకు బండి నడిపిస్తూ జీవనం కొ నసాగిస్తున్నారు.
అయితే.. కొంతకాలం గా భార్యపై అనుమానం పెంచుకోవడం తో భార్యాభర్తల భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈ విషయంపై బుధవారం పెద్దల మధ్య పంచాయితీ జరిగింది. ఈ క్రమంలో రాత్రి మళ్లీ గొడవ జరగడంతో తీవ్ర మ నస్తాపానికి గురైన సుజాత గురువారం మధ్యాహ్నం తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని నారపల్లిలో ఉన్న చెరువులో దూ కింది. గమనించిన స్థానికులు ఇద్దరు పిల్లలను రక్షించగా.. తల్లి, చిన్న కూ తురు నీటిలో మునిగి మృతి చెందారు.