హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో ఓ రౌడీషీటర్ (Rowdy Sheeter) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్యచేశారు. ఫలక్నుమా రౌడీ షీటర్ మసీయుద్దీన్ను గుర్తు తెలియని వ్యక్తి హత్యచేశారు. ఆదివారం రాత్రి రెయిన్ బజార్లో అతనిపై కత్తులతో డాదిచేసి చంపేశారు. అయితే పాత కక్షల కారణంగా అతడి ప్రత్యర్థులే యుద్దీన్ను హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాగా, మసీయుద్దీన్కు మూడు రోజుల క్రితమే పెండ్లి అయినట్టు తెలుస్తున్నది.