హైదరాబాద్ : టాస్క్‌ఫోర్స్ పోలీస్ పేరుతో(Fake police) అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాదవ్ అనే వ్యక్తి నకలీ పోలీస్ అవతారమెత్తి పలువురిని బెదరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇటీవల ఓ మహిళను బెదిరించి రూ.10 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు జాదవ్‌ను అరెస్ట్ చేసి రూ.3లక్షలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.