HDFC | వెంగళరావునగర్, జూన్ 26 : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ మిషన్‌లో నకిలీ నోట్లు చూసి బ్యాంక్ అధికారులు ఖంగుతిన్నారు. పోలీసుల కథనం ప్రకారం అమీర్‌పేట్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ మిషన్ నుంచి నగదు సేకరిస్తున్న సమయంలో బ్యాంక్ ఉద్యోగి శ్రవణ్ కుమార్, ఎం.సాయికుమార్ గౌడ్లు నకిలీ రూ.500 నోట్లను గుర్తించారు. మొత్తం రూ.5 వేలను జూన్ 1వ తేదీన ఖాతాదారుడు జమ చేసినట్లు గుర్తించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ప్రకాష్ చంద్ర ఇనాని గురువారం ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.