చర్లపల్లి, జూన్ 27: నకిలీ బంగారం విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఆగ్రాకు చెందిన దేవేందర్కుమార్(65), అదే ప్రాంతానికి చెందిన రవి(30), గనుక్బాయి(45)లు కలిసి చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ చక్రీపురంలో ఉండే ప్రియ స్మైల్ క్లినిక్ వెళ్లి తమ వద్ద కిలో బంగారం ఉందని, ఆ బంగారాన్ని నాలుగు లక్షలకే విక్రయిస్తామని పేర్కొనడంతో డాక్టర్ ప్రయాంక ఆ బంగారాన్ని తనిఖీ చేసింది.
నకిలీదని తేలడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.