Hyderabad | హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ టికెట్లు కలకలం సృష్టించాయి. పలువురు ప్రయాణికుల వద్ద నకిలీ టికెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో నకిలీ టికెట్లతో ప్రయాణానికి వచ్చిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. వారికి నకిలీ టికెట్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో ఎయిర్‌పోర్టు పోలీసులు ఆరా తీస్తున్నారు.