చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 6 : ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా కొన సాగుతోంది. తెలంగాణలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి న గరంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను డబీర్పురా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 91 నకిలీ సర్టిఫికెట్లను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ, తూర్పు మండలం అదనపు డీసీపీ స్వామి, మలక్పేట్ ఏసీపీ శ్యాంసుందర్, ఇన్స్పెక్టర్ నాను నాయక్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీరాం సైదాబాబుతో కలిసి వివరాలను వెల్లడించారు.
పాతబస్తీలో ఎలాంటి విద్యార్హతలు లేకుండా విదేశాలకు వెళ్లే వా రికి నకిలీ సర్టిఫికెట్లను అమ్ముతున్నట్లు డబీర్పురా పోలీసులకు సమాచారం అందింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. గురువారం చంచల్గూడ న్యూరోడ్లో వెళ్తున్న ఇద్దరిని డబీర్పురా, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించ గా నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు అయ్యింది. ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ కేంద్రంగా సంజయ్ శర్మ అనే వ్యక్తి తెలంగాణలోని వివిధ విద్యాసంస్థలకు చెంది న నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి సరఫరా చేస్తున్నాడు. శాలిబండకు చెందిన అబ్దుల్ కదీర్ అలియాస్ కదీర్(47), డబీర్ పురా ఫర్హత్నగర్కు చెందిన మహ్మద్ షకీల్(37)లు నగరంలో అవసరం ఉన్నవారికి నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నారు. వారి నుంచి మొత్తం 91 నకిలీ సర్టిఫికెట్లను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నా రు. వీటిలో కాకతీయ, నాగార్జున, ఉస్మానియా యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లు ఉన్నాయి.