Jagadish Market | సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జగదీశ్ మార్కెట్లో నకిలీ యాపిల్ ఫోన్ సామగ్రిని విక్రయిస్తున్న నాలుగు దుకాణాలపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అబిడ్స్ పోలీసులతో కలిసి దాడి చేసి రూ. 2.42 కోట్ల విలువైన నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
డీసీపీ సుదీంద్ర కథనం ప్రకారం.. జగదీశ్ మార్కెట్లో నింబ్ సింగ్ టార్కెట్ మొబైల్ షాప్, హీర రామ్ పటేల్ మొబైల్ షాప్, గోవింద్ లాల్ చౌహాన్ అశుపురా మొబైల్ షాప్, ముకేశ్ జైన్ నంది మొబైల్స్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. సెల్‌ఫోన్‌కు సంబంధించిన వివిధ యాక్ససరీస్‌లను విక్రయిస్తున్నారు, ఇందులో భాగంగా ఆయా యాక్ససరీలస్కు యాపిల్ ఫోన్ లోగోలు వేసి, అసలైనవనే భ్రమను కల్పిస్తూ విక్రయాలు సాగిస్తున్నారు.
కాపీ రైట్ ఉల్లంఘటనలతో పాటు అమాయకులను మోసం చేస్తున్న వ్యాపారులపై వచ్చిన ఫిర్యాదుతో దాడులు చేయగా భారీ ఎత్తున యాపిల్ పేరుతో ఉన్న నకిలీ ఫోన్ యాక్ససరీస్ బయటపడ్డాయి. నిందితులను అరెస్ట్ చేశారు.