సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కంటివెలుగు 39వ రోజుకు చేరుకుంది. బుధవారం 274 కేంద్రాల్లో 29,691 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందు లో 4,442 మందికి రీడింగ్ గ్లాసెస్‌ను పంపిణీ చేయగా… 2,376 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
నగరంలో 115 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. 38వ రోజు మొత్తం 10,200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 2350 మందికి రీడింగ్ గ్లాసెస్‌ను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 1051 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌కు సిఫారసు చేసినట్లు తెలిపారు.
జిల్లా పరిధిలో మొత్తం 80 కంటి వెలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మొత్తం 9901 మందికి కంటి పరీక్షలు చేయగా… వారిలో 923మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. కాగా 802 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌కు సిఫారసు చేశామన్నారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 79 కేంద్రాల ద్వారా 9530 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. వారిలో 1169 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశామని, 523 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌కు సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు.